Friday, March 21, 2008

అందమయిన ప్రపంచం

నేను ఉండేది యురొప్ లొ ఉన్న జర్మని దేశము లో......... ఒకపక్క స్విట్జర్లాన్డ్, మరో పక్క ప్రాన్స్. ప్రపంచం లొఅద్బుతాలు అయినటువంటి పీసా టవరు, ఐఫిల్ టవరు, ఆల్ప్సు పర్వతాలు ఇలాంటివి ఎన్నో అందాలతొ ఊరిస్తుంది యురొప్................ఇధి నా చుట్టు ఉన్న ప్రపంచం................ కాని ఇంత్ కన్నా అందమయిన ప్రపచం మీకు పరిచయము చెయ్యబోతున్నాఇప్పుడు.


యురోప్ కంటే అందమయిన ప్రపంచమా అనుకుంటున్నారా...........ఇధి నేను నాలో కట్టుకున్న ప్రపంచం.........అదేమిటా అనుకుంటున్నారా.........అయితే మీకు కొన్ని విషయాలు తెలియాలి.


అమ్మ అన్నా అమ్మ చేతి వంట అన్నా నాకు ప్రాణం.............. నేను అమ్మ దగ్గర వంట నేర్చుకున్నాను కాని ఆ రుచి రాదు............. మరి తల్లి ప్రేమ కలిపి చేస్తుంది అనుకుంటా అంత రుచిగా ఉంటాయి............ ఆమె మనసు మదురం.........ఆమె వంట అమేఘం..........ఆమే ముట్టుకుంటె అవ్వదా పరవన్నమయినా పంచామ్రుతం................ నాన్నగారు ఎక్కడ ఉంటే అక్కడ శందడే శందడే...... ఆయన జొకులతో ఎప్పుడూ రడీ రడీ..........ఈయన జొక్ వేస్తే చంద్రబాబు మాత్రమె కాదు వాల్ల బాబు కూడా నవ్వాల్సిందే. చిరంజీవి డాన్సు వేస్తే జనాలు చిందు వేస్తారు....... నాన్నగరు జొకు వేస్తే పక పక నవ్వేస్తారు.


పెళ్లి అయిన అతి తక్కువ కాలంలొనే మా ఇంటిలొ అందరితో చక్కగా కలిసిపొయింది నా దీప. పెళ్ళి అయిన తరువాత తనతో ఎక్కువ సమయము గడపలేకపోయినా తను పెద్ద మనసుతొ అర్దం చేసకొని నా మనసుకు మరింత దగ్గర అయింది. తన పేరు లోనే ఉంది దీపం.......తను వచ్చాక అయ్యింది మా ఇళ్ళు నందనవనం............ నేను వెల్లాగానే బొలెడు కబుర్లు, జొకులతొ తయ్యరు నా తమ్ముడు . ఇంట్లొ అందరం పిలుస్తాము వీడిని ఛిన్ని గాడు. . అందరి కన్నా చిన్న వయసు........అందరి కన్నా పెద్ద మనసు. నన్ను ఆట పట్టించడం వీడికి సరదా వీడిని ఆట పట్టించడం నాకు సరదా.


రజింత్, శ్రీనివాసు, సతీష్ వీరు నా ప్రియ మిత్రులు. నేను వస్తున్నా అని తెలిసిన రోజునుండి ఎయిర్ పోర్టు లొ తిస్ట వెసెసారు శ్రేనివాసు , సతీష్. . సతిష్ నాకు బావ అవుతాడు జనానికి దాడి చత్రపతి అవుతాడు...................

రోజు అంతా బలాదురులు.....అర్దరాత్రి వరకు అసుకులు........
చెప్పుకున్న జోకులు..........ఆడుకున్న ఆటలు.........
చేసుకున్న త్యాగాలు.............పంచుకున్న కస్టసుఖాలు........
దేవుడు ఇచ్చిన వరాలు..........వీరే నా ప్రాణ స్నేహితులు........


నేను వైజాగు లొ ఉన్నా అని తెలిసి రంజిత్ చెన్నయి ఆఫీసులొ శ్రినివాసు హైదరాబాదు ఆపిసులొ వాల్ల బాసుల తొ
రంజిత్/శ్రినివాసు : నాకు కడుపు నొప్పిగా ఉన్నట్టు ఉంది.
బాసు : మీ ఫ్రేండ్ ఇండియా వచ్చే టైం అయింది.
రంజిత్/శ్రినివాసు : వైజాగు వెల్లే ట్రయిన్ రడిగా ఉంది.
అలా ఆపిసు డుమ్మా కొట్టి వచ్చెసారు.

స్వీట్ ఇండియా దగ్గర పాణి పూరిలు........ బీచ్ రోడ్ మీద బయిక్ షికార్లు,
పెద్ద స్క్రీన్ లొ సినిమాలు...............మరువలేని మదురానుబూతులు.
నేను పెరిగిన వాతావరణం, నేను పట్టిన పలప బలపం.......
అమ్మ నాన్నల అనురాగం, చిన్ని తమ్ముడి ఆప్యాయం........
పాణమిచ్చే స్నేహ బ్రుందం, తొడు నీడగా నా దీపం..............
ఇదే నేను కట్టుకున్న సుందర ప్రపంచం.